గత కొన్ని రోజుల కితమే మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ వద్ద దిగ్గజ నటులు సూపర్ స్టార్ కృష్ణ గారిని కోల్పోవడం పెద్ద లోటు కాగా ఈ వార్త ఇంకా మరువక ముందే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ లో పలు ఆసక్తికర సినిమాలకి దర్శకునిగా రచయితగా పని చేసిన ప్రముఖ దర్శక రచయిత మదన్(రామిగని మదన్ మోహన్ రెడ్డి) ఈరోజు నవంబర్ 20 తెల్లవారు 1 గంట 41 నిమిషాలకి కన్నుమూశారు.
గత కొన్ని రోజులు కితమే బ్రెయిన్ పోటుతో హైదరాబాద్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యిన ఈరోజు ఉదయం వరకు సీరియస్ కండిషన్ లో పోరాడారు. కానీ పరిస్థితి చేయి దాటడంతో ఆయన కన్ను మూశారు. మరి తాను అయితే పలు చిత్రాలు పెళ్ళైన కొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించగా..
నటకిరీటి రాజేంద్రప్రసాద్ తీసిన టాలీవుడ్ క్లాసిక్ చిత్రం “ఆ నలుగురు” చిత్రానికి రచయితగా పని చేసారు. మరి ఈ చిత్రానికి గాను అనేక నంది అవార్డులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి రచయితను కోల్పోవడం టాలీవుడ్ దగ్గర మరో విషాదం అని చెప్పాలి. మరి వారి మరణనానికి మా 123తెలుగు యూనిట్ అంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.