ఇటీవలే మన భారత దేశ సినిమా దగ్గర దిగ్గజ కళాకారులలో ఒకరైన గాన కోకిక లతా మంగేష్కర్ తన తుది శ్వాస విడవడం ఎంతటి విషాదాన్ని నెలకొల్పిందో తెలిసిందే. అయితే ఈ విషాద వార్త మరువక ముందే మరో విషాదం ఇప్పుడు చోటు చేసుకుంది. 1980వ దశకంలో ప్రసారం అయ్యిన ‘మహాభారతం’ ధారావాహికలో ప్రతి ఒక్క పాత్ర కూడా ఇప్పటికీ అందరికీ గుర్తు ఉంటాయి.
మరి వాటిలో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ప్రవీణ్ కుమార్ శోబ్టి ఇప్పుడు కన్ను మూశారన్న వార్త మరో విషాదాన్ని నెలకొల్పింది. అయితే మరిన్ని వివరాల్లోకి వెళ్లినట్టు అయితే ఢిల్లీ లో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్ నిన్న సోమవారం సడెన్ హార్ట్ ఎటాక్ రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేయగా పరిస్థితి చేదాటి తాను తన 74వ ఏట కన్ను మూశారట.
అయితే ఆయన కేవలం నటుడు గానే కాకుండా జాతికి కూడా ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకొచ్చారు. రెండు సార్లు ఒలింపిక్స్ ఛాంపియన్ గా నాలుగు సార్లు ఆసియన్ మెడలిస్ట్ గా నిలిచారని భారదేశ సెక్యూరిటీ ఫోర్స్ వారు ఆయనకు నివాళులు అర్పించారు. మరి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 13తెలుగు యూనిట్ కూడా ఆకాంక్షిస్తుంది.
The iconic role of 'Bheem' essayed by Sh Praveen Kumar Sobti in B R Chopra's Mahabharat will continue to bring back memories of the 'gentle giant'.#Mahabharat #Bheem #PraveenKumarSobti #RIP pic.twitter.com/qgfT1psUk0
— BSF (@BSF_India) February 8, 2022