ఉపేంద్రతో కలిసి ‘కబ్జా’ చేయనున్న ఆ స్టార్ హీరో ఎవరు ?

Published on Jan 13, 2021 12:26 am IST

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర చేస్తున్న కొత్త చిత్రం ‘కబ్జా’. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏడు భాషల్లో విడుదలకానుంది. అండర్ వరల్డ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఫస్ట్ లుక్ విడుదలైన నాటి నుండే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచుతూ కొత్త అప్డేట్ ఒకటి వదిలారు టీమ్. ‘U+?’ అనే అక్షరాలతో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. జనవరి 14న భారీ సీక్రెట్ రివీల్ చేస్తామని ప్రకటించారు. ఉపేంద్ర సినిమాల తరహాలోనే పోస్టర్ కూడ కన్ఫ్యూజ్ చేసేలానే ఉంది. అయితే ప్రేక్షకులకు చిన్న హింట్ అన్నట్టు కొన్ని పోస్టర్లను చూపెట్టారు.

ఆ పోస్టర్లో ‘బిల్లా-రంగ, దళపతి, దేవదాస్, షోలే, సత్యం శివమ్, అయ్యప్పనుమ్ కోషియుమ్, విక్రమ్ వేదా, లవకుశ’ లాంటి మల్టీస్టారర్ సినిమాలను ప్రస్తావిస్తూ మన స్టార్లను ఒకే సినిమాలో చూడటం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అది అరుదుగా జరుగుతుంటుంది అన్నారు. దీన్నిబట్టి పోస్టర్లో ‘U’ అంటే ఉపేంద్ర అని ‘?’ అంటే వేరొక హీరో అని, ఆ హీరో ఎవరనేదే సస్పెన్స్ అని అర్థమవుతోంది. అంటే సినిమాలో ఉపేంద్రతో పాటు మరొక పెద్ద స్టార్ నటించనున్నారన్నది స్పష్టం. ఆ పెద్ద స్టార్ ఎవరు, అతను కన్నడ నటుడేనా లేకపోతే వేరొక భాషకు చెందిన నటుడా, అతని పాత్ర ఎలా ఉండబోతుంది అనేవి ఆసక్తికరంగా మారాయి. మరి ఆ సంగతులన్నీ తెలియాలంటే 14 వరకు ఆగాల్సిందే. ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్.చంద్రశేఖర్, మునింద్ర కె. పురా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More