రాకీ భాయ్ కూడా ఇంకా లైన్ లో ఉన్నాడు.!

Published on Oct 17, 2020 9:09 pm IST


కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. ఈ చిత్రం తాలుకా లేటెస్ట్ షూట్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ హైదరాబాద్ లో చేస్తున్నారు. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ చిత్రానికి సంబంధించి గత కొన్నాళ్ల నుంచి ఓ టాక్ వినిపిస్తూనే ఉంది.

అదే ఈ చిత్రం తాలూకా టీజర్ కోసం. కేజీయఫ్ ఫ్యాన్స్ అంతా ఈ సాలిడ్ యాక్షన్ టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి అన్ని అంచనాలను ఏర్పర్చుకున్న ఈ టీజర్ ను మేకర్స్ ఈ దసరా కానుకగా విడుదల చేస్తారని టాక్ వచ్చింది. కానీ ఇప్పటికీ అదే టాక్ అలా వినిపిస్తుంది. వచ్చే అక్టోబర్ 25న బహుశా దసరా కానుకగా టీజర్ ఉంటే ఉండొచ్చు అనే తెలుస్తుంది. మరి నీల్ అండ్ టీం ఈ సాలిడ్ టీజర్ ను అప్పుడే రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More