“అంటే సుందరానికీ” వరల్డ్ ప్రీమియర్ డేట్ వచ్చేసింది.!

Published on Sep 22, 2022 9:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా మరో నాచురల్ బ్యూటీ నజ్రియా ఫహద్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “అంటే సుందరానికి” కోసం తెలిసిందే. నాని కెరీర్ లో ఓ డీసెంట్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉండగా ఓటిటి లో కూడా మంచి సక్సెస్ ని అందుకుని ఇప్పుడు అయితే టెలివిజన్ ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయ్యింది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులు జెమినీ టీవీ వారు సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ సినిమా టెలికాస్ట్ పై అయితే డేట్ ని ఫిక్స్ చేసేసారు. ఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ అక్టోబర్ 2న చేస్తున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. మరి దీనితో అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కి వీకెండ్ లో మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :