యాంటీ ఇండియన్ ఆర్షద్.. ప్రభాస్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఇంతే..

యాంటీ ఇండియన్ ఆర్షద్.. ప్రభాస్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఇంతే..

Published on Aug 24, 2024 7:10 AM IST

గత కొన్ని రోజులు నుంచి నేషనల్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ అర్షద్ వర్సీ మన టాలీవుడ్ ప్రైడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు అంశమే అని చెప్పాలి. ఇక్కడ నుంచి అర్షద్ ఇండియా వైడ్ గా ట్రెండింగ్ గా నిలవగా ప్రభాస్ అభిమానులు సహా టాలీవుడ్ ఇతర స్టార్స్ ప్రభాస్ కి అర్షద్ క్షమాపణ చెప్పి మాటని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఒక హీరోని అంటే అందరికన్నా ఎక్కువ హర్ట్ అయ్యేది ఆ హీరో తాలూకా అభిమానులే.. అలాంటిది డై హార్డ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ అర్షద్ గతాన్ని సోషల్ మీడియాలో తవ్వారు. గతంలో 2012 లో చేసిన ట్వీట్ ఒకటి దొరికింది. నేను ఆఫ్ఘనిస్తాన్ ఓ మీటింగ్ కోసం వెళ్తున్నాను కుదిరితే షిఫ్ట్ అయిపోతాను ఇండియా కంటే ఇక్కడ సేఫ్ అంటూ పోస్ట్ చేసాడు. దీనితో ఇప్పుడు ఈ పోస్ట్ ని డార్లింగ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. భారతదేశ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లేది మా హీరో అయితే కనీసం దేశంలో ఉండేందుకు ఇష్టపడని యాంటీ ఇండియన్ అర్షద్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే లాస్ట్ కి ఇలా ఉంటుందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు