పోలీసుల మీద అనుష్క ప్రశంసలు

Published on Jan 27, 2021 11:00 pm IST

స్టార్ హీరోయిన్ అనుష్క కమర్షియల్ ప్రకటనలకు చాలా దూరం. బోలేదంటు స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ దానిని క్యాష్ చేసుకోవడం ఆమెకు ఇష్టం ఉండదు. అందుకే పెద్ద పెద్ద వాణిజ్య సంస్థల నుండి బ్రాండ్ అంబాసిడర్ ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించారు. ఆమె బయట కార్యక్రమాల్లో కనిపించడం కూడ చాలా తక్కువ. ఒకవేళ బయటికొచ్చినా హడావుడి లేకుండా సాధారణ వ్యక్తిలానే ఉండటానికి ఇష్టపడుతుంటారు.

కానీ ఏదైనా సామాజిక కార్యక్రమం నుండి ఆహ్వానం అందితే మాత్రం తప్పకుండా హాజరై సపోర్ట్ చేస్తారామె. తాజాగా హైదరాబాద్లో జరిగిన షీ పాహి , ఫస్ట్ అన్యువల్ కాన్ఫరెన్స్ 2021 ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనుష్క పాల్గొన్నారు. మహిళా భద్రతా అదనపు డీజీ స్వాతిలక్రా, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, షీ టీమ్స్‌ డీసీపీ అనసూయతో కలిసి సైబరాబాద్‌ డయల్‌ 100 క్విక్‌ రెస్పాన్స్‌ వాహనాలను ప్రారంభించారు.

మేము తెరపైన మాత్రమే నటించి స్టార్లము మాత్రమే. కానీ ప్రజల కోసం, వారి భద్రత కోసం ప్రతి క్షణం విధులు నిర్వహించే ప్రతి ఒక్క పోలీస్ ఒక స్టార్ అని కరోనా విజృంభిస్తున్న సమయంలో పోలీసులు చాలా బాగా పని చేశారని పొగిడారు. వారందరికీ నమస్కారాలని ఇలాంటి కార్యక్రమాల కు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇంత మంది మహిళా పోలీసులు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇకపోతేఅనుష్క ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఆ ప్రాజెక్ట్ వివరాలు త్వరలోనే బయటకురానున్నాయి.

సంబంధిత సమాచారం :