అనుష్క ‘ఘాటీ’ పరిస్థితేంటి ?

డైరెక్టర్ క్రిష్, అనుష్క ప్రధాన పాత్రలో ‘ఘాటీ’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ కాబోతుంది. అయితే, రిలీజ్ కి ఇక కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. కానీ, మేకర్స్ మాత్రం ఇంకా ప్రమోషన్స్ ను మొదలుపెట్టలేదు. ఒక్క టీజర్ విడుదల తప్ప, మరే ఏ ప్రచార కార్యక్రమాలను స్టార్ట్ చేయలేదు. దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందనే ఊహాగానాలు అభిమానులలో చెలరేగాయి. దానికి తగ్గట్టుగానే ఘాటీ సినిమా రిలీజ్ ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.

కాకపోతే, ఘాటీ మేకర్స్ నుంచి రిలీజ్ పోస్ట్ ఫోన్ పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. ఇక ఈ చిత్రం థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఘాటీ అమెజాన్ లోకి రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మేకర్స్ రూపొందించారు. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

Exit mobile version