పవన్ ను కలిసిన కొత్త ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.!

Published on Aug 8, 2020 2:10 am IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడెద్దుల ప్రయాణం చేస్తున్నారని చెప్పాలి. ఒక పక్క సినిమాలు అలాగే మరోపక్క రాజకీయాలు సమానంగా చేస్తూ ఇప్పుడు రాణిస్తున్నారు. ప్రస్తుతం హీరోగా ఓ మూడు ప్రాజెక్టులను కన్ఫర్మ్ చేసిన పవన్ జనసేన పార్టీ అధినేతగా జరుగుతున్న పాలిటిక్స్ ను కూడా యథేచ్ఛగా గమనిస్తూ తన స్పందనను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తున్నారు.

ఇదిలా ఉండగా ఏపీ భారతీయ జనతా పార్టీకు నూతన అధ్యక్షునిగా ప్రముఖ రాజకీయ నాయకుడు సోము వీర్రాజు నియమితులు కాగా పవన్ ఇది వరకే తన అభినందనలు తెలిపారు. అలా నిన్ననే పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారితో భేటీ అయ్యి కీలక అంశాలను చర్చించారు. ఇప్పుడు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసి కొన్ని కీలక అంశాల కోసం చర్చించారు. రాబోయే రాబోయే రోజుల్లో ఇరు పార్టీలు ఎలా కలిసి పని చెయ్యాలి అన్న ప్రణాళికలతో పాటు తాజాగా హాట్ టాపిక్ అయినా అమరావతి రైతుల సమస్యల కోసం కూడా వీరు చర్చించినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More