దిగ్గజ బిజినెస్ మెన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుక ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనంత్ అంబానీ, రాధికా మెర్చంట్ ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు క్యూ కట్టారు. ఇక రాజకీయ నేతలు సైతం అంబానీ ఇంటి బాట పట్టారు.
తాజాగా అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ సెరోమనిలో నిర్వహిస్తున్న శుభ్ ఆశీర్వాద్ వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిలు హాజరయ్యారు. వారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు హాజరు కావడం విశేషం. నూతన వధూవరులను వారు ఆశీర్వదించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వారి వెంట కనిపించారు. ఇక ఈ వేడుకకు ఈస్థాయిలో సెలబ్రిటీలు వస్తుండటంతో సోషల్ మీడియాలో అంబానీ వారి మ్యారేజీ ఫీవర్ నెలకొంది.