కరోనా పై యుద్ధం చేస్తున్న సైనికులకు తారల సెల్యూట్.

Published on Jun 5, 2020 12:39 am IST


కరోనాపై పోరులో డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు అలుపెరని పోరు సాగిస్తున్నారు. ప్రాణాలని సైతం లెక్కచేయక శ్రమిస్తున్నారు. వీరిపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వీరికి సంఘీభావం తెలుపుతూ ఓ పాటని రూపొందించి అంకితం చేసింది. `సమరం.. సమరం.. విధితో సమరం..` అంటూ సాగిన ఈ పాటలో స్టార్స్ కాజల్ అగర్వాల్, హీరో నిఖిల్‌, ప్రణీత భాగమయ్యారు. ఆ అలాగే పీవీ సింధూ, ద్రోణవల్లి హారిక, పాయల్ రాజ్‌పుత్‌, సుధీర్‌బాబు, నిధి అగర్వాల్ కూడా ఈ స్ఫూర్తి దాయక వీడియోలో నటించిన ప్రజలలో అవగాహనా, పోలీస్ మరియు వైద్య సిబ్బందిలో ఆత్మ స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు.

ఈ పాటను టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ స్వర పరచి స్వయంగా పాడారు. వై ఎస్ ఆర్ సి పి ఎంపీ విజయ సాయి రెడ్డి దీనిని నిర్మించడం జరిగింది. దీనికి దర్శకుడు చందూ మొండేటి కాన్సెప్ట్ మరియు డైరెక్ట్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More