‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా ఇప్పటికే బ్లాక్‌బస్టర్ వైబ్స్‌ను క్రియేట్ చేస్తున్నాయి. అయితే, ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం సాలిడ్ గుడ్ న్యూస్‌ను ఇచ్చింది.

సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఇఫ్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు టికెట్ రేట్లు పెంచుకునేలా అనుమతులిచ్చిన ఏపీ సర్కార్.. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి కూడా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలిపింది. ఈ సినిమాకు మల్టీప్లెక్స్‌లలో రూ.125, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 మేర టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ఇక రిలీజ్ రోజున ఆరు ఆటలు.. అటుపై పది రోజులు 5 ఆటలు ప్రదర్శించుకునేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఇక ఈ సినిమాలో అందాల భామలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్ఫణలో శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version