స్టార్ హీరో ప్రాజెక్ట్ నుండి మురుగదాస్ తప్పుకున్నారా ?

Published on Oct 27, 2020 8:22 pm IST


తమిళ స్టార్ హీరో విజయ్ తన తర్వాతి సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. చాలా నెలల క్రితమే సెట్టైనా ఈ ప్రాజెక్ట్ లాక్ డౌన్ కారణంగా మొదలుకాలేకపోయింది. ఇప్పుడు లాక్ డౌన్ లేకపోవడంతో సినిమాను స్టార్ట్ చేయాలని చూశారు దర్శక నిర్మాతలు. కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి మురుగదాస్ తప్పుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మురుగదాస్ చెప్పిన కథలో కొన్ని మార్పులు కావాలని విజయ్ అడిగారట. కానీ మురుగదాస్ మార్పులు చేయలేదట.

పైగా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్, మురుగదాస్ నడుమ రెమ్యునరేషన్ విషయమై కూడ విబేధాలు తలెత్తాయట. మురుగదాస్ డిమాండ్ చేసినంత పెద్ద మొత్తాన్ని ఇవ్వలేమని, అమౌంట్ తగ్గించుకోమని కోరారట. కానీ మురుగదాస్ కాంప్రమైజ్ కాలేదట. దీంతో ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది.

గతంలో విజయ, మురుగదాస్ కలిసి చేసిన ‘తుపాకి, కత్తి, సర్కార్’ లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. వీరిద్దరికీ మధ్యన మంచి రాపో కూడ ఉంది. అయినా కొత్త ప్త్రాజెక్ట్ సమస్యల్లో పడిందంటూ వార్తలు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇకపోతే విజయ్ ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ దర్శత్వంలో ‘మాస్టర్’ సినిమాను చేస్తున్నారు. ఇది చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

సంబంధిత సమాచారం :

More