2.0 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేసిన ఏఆర్ రహమాన్ !

2.0 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేసిన ఏఆర్ రహమాన్ !

Published on Oct 13, 2018 8:00 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 చిత్రం విడుదలకు సమయం దగ్గర పడుతుంది. ఎలాగైనా ఈచిత్రాన్ని నవంబర్ 29న థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా చిత్ర సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ ఈచిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ను పూర్తి చేశాడు. ఫారెన్ మ్యూజిషియన్స్ తో కలిసి ఆయన అద్భుతమైన స్కోర్ ను అందిచారట.

ఈచిత్ర దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను కట్ చేసే పనిలో ఉన్నారట. త్వరలోనే ఈ ట్రైలర్ ప్రేక్షకులముందుకు రానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రం తెలుగు , తమిళ , హిందీ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు