తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సిరీస్ అండర్ వరల్డ్ బిలియనీర్స్. వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూ పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో ప్రస్తుతం మరొక ఆసక్తికరమైన వెబ్ సిరీస్ చేస్తున్నారు. గగన్ గోపాల్ ముల్క దర్శకత్వం వహిస్తున్న ఈ సీరీస్ ను LS ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎల్. శ్రీనివాసులు, దీవి వేణుగోపాల్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సిరీస్ యొక్క ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.
స్టైలిష్ లుక్ లో అరవింద్ కృష్ణ కనిపిస్తుండగా, ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తున్న ఈ లుక్ సిరీస్ పై మంచి అంచనాలు పెంచుతుంది. ఈ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. రాధిక ప్రీతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సీరీస్ లో మధు సూధన్, జ్యోతి రాయ్, షవర్ అలీ, అలోక్ జైన్, లీనా కపూర్ మరియు రవి మల్లిడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సీరీస్ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సిరీస్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం గగన్ గోపాల్ ముల్క, నిర్మాతలు ఎం. శ్రీనివాసులు, దీవి వేణుగోపాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జనార్థనం కేసాని, సంగీతం ఎస్ చిన్నా, సినిమాటోగ్రఫీ టి సురేంద్ర రెడ్డి, ఎడిటర్ జునైద్ సిద్ధిక్, కొరియోగ్రఫీ పైడి రాజు, కో డైరెక్టర్ నవీన్ పొదిల, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కృష్ణా రెడ్డి మట్టా, యాక్షన్ డ్రాగన్ ప్రకాష్, PRO సాయి సతీష్ లుగా వ్యవహరిస్తున్నారు.