ఫ్యాన్స్ తో “ఓజి” ఫస్ట్ డే ఫస్ట్ షో చూడనున్న అర్జున్ దాస్!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజి (దే కాల్ హిమ్ ఓజి) పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 27 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. అయితే ఈ చిత్రం నుండి రిలీజైన గ్లింప్స్ మాత్రం అభిమానులకి సాలిడ్ ఫీస్ట్ లా మారింది.

పవన్ కళ్యాణ్ ను ఎలా అయితే చూడాలి అని అభిమానులు అనుకుంటున్నారో, ఆ లెవెల్లో గ్లింప్స్ ఉండటంతో సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లింప్స్ కి వచ్చిన రెస్పాన్స్ పట్ల అర్జున్ దాస్ మరోసారి రెస్పాండ్ అయ్యాడు. ఈ గ్లింప్స్ కి అర్జున్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుదర్శన్ 35ఎంఎం లేదా సంధ్య లో ఈ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి వేచి ఉండలేను అని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ కొద్ది సేపటికే వైరల్ గా మారింది. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా రెడ్డి మరొక కీలక పాత్రలో కనిపించనుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version