క‌ల్కి లో శ్రీ‌కృష్ణుడి వాయిస్.. గుర్తుప‌ట్టారా..?

క‌ల్కి లో శ్రీ‌కృష్ణుడి వాయిస్.. గుర్తుప‌ట్టారా..?

Published on Jun 27, 2024 5:16 PM IST

స్టార్ హీరో ప్ర‌భాస్ నటించిన లేటెస్ట్ సెన్సేష‌నల్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ నేడు వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెర‌కెక్కించ‌గా భారీ క్యాస్టింగ్ తో ఈ మూవీ రూపొందింది. మైథాల‌జీ, సైన్స్ ఫిక్ష‌న్ అంశాల‌తో రూపొందిన‌ ఈ సినిమాలో మ‌హాభార‌తం ఆధారంగా కొన్ని సీన్స్ తెర‌కెక్కించారు.

అయితే, ఇందులో మ‌హాభార‌త యుద్ధానికి సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయి. ఇందులో శ్రీ‌కృష్ణుడి పాత్ర కూడా ఉండ‌గా, ఆయ‌న ముఖాన్ని రివీల్ చేయ‌కుండా కేవ‌లం వాయిస్ తోనే మెస్మైరైజ్ చేశారు మేక‌ర్స్. ఈ శ్రీ‌కృష్ణుడి పాత్ర‌లో న‌టించిన వారు ఎవ‌ర‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. కానీ, శ్రీ‌కృష్ణుడి వాయిస్ ని చాలా త‌క్కువ మంది గుర్తుప‌ట్టారు.

శ్రీ‌కృష్ణుడి పాత్ర‌కు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చింది మ‌రెవ‌రో కాదు.. ట్యాలెంటెడ్ యాక్ట‌ర్ అర్జ‌న్ దాస్. మంచి బేస్ వాయిస్ ఉన్న ఈ యాక్ట‌ర్ ఖైదీ, మాస్ట‌ర్, విక్ర‌మ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు క‌ల్కి మూవీలోని శ్రీ‌కృష్ణుడి పాత్ర‌కు అర్జున్ దాస్ వాయిస్ ఇచ్చాడ‌ని తెలుసుకుని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మొత్తానికి త‌నదైన వాయిస్ తో మ‌రోసారి అర్జున్ దాస్ ఆక‌ట్టుకున్నాడనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు