స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత నాగవంశీ కలయికలో ఆల్రెడీ ‘డీజే టిల్లు’, ‘డీజే టిల్లు 2’ వంటి రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. పైగా హ్యాట్రిక్ ప్రాజెక్ట్ గా కోహినూర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం” అనే సంచలన కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. వైవిధ్యమైన కథలు, పాత్రల ఎంపికతో అనతికాలంలోనే తనదైన కల్ట్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న సిద్ధూ ఇప్పుడు, నిర్మాత నాగవంశీతో మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేయబోతున్నాడు.
సిద్ధు జొన్నలగడ్డ – నాగవంశీ కలయికలో ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం కథ పై చర్చలు జరిగాయని.. సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమా పై చాలా ఆసక్తిగా ఉన్నాడని.. కచ్చితంగా తమ కలయికలో మరో మంచి సినిమా అవుతుందని నాగవంశీ చెప్పుకొచ్చారు. మరి విభిన్నమైన మరియు ప్రత్యేకమైన కథాంశంతో రూపొందుతున్న ఆ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.