టాలీవుడ్‌లో రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ ఎమోషనల్ చిత్రంగా వచ్చిన ‘ఆర్య-2’ భారీ స్థాయిలో రీ-రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేశారు. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది.
ఇక రీ-రిలీజ్‌లో కూడా ‘ఆర్య-2’ దుమ్ములేపాడు. ‘ఆర్య-2’ చిత్రం రీ-రిలీజ్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు అక్కడ రీ-రిలీజ్ అయిన చిత్రాల్లో ‘ఆర్య-2’ ఏకంగా రూ.65 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
ఇలా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సెంటర్‌లో రీ-రిలీజ్ చిత్రాల్లో ‘ఆర్య-2’ మూవీ సృష్టించిన రికార్డు సరికొత్తది కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.