రెండు నిమిషాల్లో ముగించేసిన ‘ఆర్య-2’

రెండు నిమిషాల్లో ముగించేసిన ‘ఆర్య-2’

Published on Apr 1, 2025 8:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి సెన్సేషన్ నెలకొంటుందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆర్య-2’ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచి అప్పట్లో సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా రీ-రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ప్రస్తుతం రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ నడుస్తుండటంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న గ్రాండ్ రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ సినిమా రీ-రిలీజ్‌కు సంబంధించిన టికెట్ బుకింగ్స్ సెన్సేషనల్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తుంది. ఈ సినిమా టికెట్ బుకింగ్స్‌కు సంబంధించి సంధ్య 35 ఎంఎం థియేటర్‌లో కేవలం 2 నిమిషాల్లో సోల్డ్ ఔట్ అయినట్లు తెలిపింది.

ఇక ఈ సినిమా రీ-రిలీజ్‌కు సాలిడ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ మూవీ మంచి వసూళ్లు సాధించడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు