ప‌వ‌ర్ఫుల్ గా అశ్విన్ బాబు ‘శివం భ‌జే’ ట్రైల‌ర్ క‌ట్

ప‌వ‌ర్ఫుల్ గా అశ్విన్ బాబు ‘శివం భ‌జే’ ట్రైల‌ర్ క‌ట్

Published on Jul 23, 2024 12:23 PM IST

హీరో అశ్విన్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం ”శివం భ‌జే” ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యింది. ద‌ర్శ‌కుడు అప్స‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందింది. డ్రామా, స‌స్పెన్స్ అంశాలు కూడా ఈ సినిమాలో ఉండ‌నున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

‘శివం భ‌జే’ ట్రైల‌ర్ ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ గా నిలిచింది. ఓ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్ సినిమాలో ఉండాల్సిన అంశాల‌న్నింటినీ మ‌న‌కు ఈ ట్రైల‌ర్ లో చూపెట్టారు. క‌థ కూడా కొత్త‌గా ఉండ‌బోతుంద‌ని ఈ ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. ఇక అశ్విన్ బాబు త‌న‌దైన పర్ఫార్మెన్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమాకు వికాస్ బ‌డిసా మ్యూజిక్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్న‌ట్లు ఈ ట్రైల‌ర్ క‌ట్ చూస్తే స్ప‌ష్ట‌మవుతోంది.

ఇక ‘శివం భ‌జే’ మూవీలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, దిగంగ‌నా సూర్య‌వంశీ, హైప‌ర్ ఆది, ముర‌ళీ శ‌ర్మ‌, బ్ర‌హ్మాజీ, తుల‌సి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాను గంగా ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై మ‌హేశ్వ‌ర్ రెడ్డి మూలి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగ‌స్టు 1న ఈ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు