ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ‘కల్కి 2898 ఏడీ’తో ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వనీదత్ తన మనసులోని మాటను బయట పెడుతూ రాజమౌళి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, అశ్వనీదత్ ఏం మాట్లాడారు అంటే.. ‘రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్ నం 1’కు నేను ప్రజంటర్గా వ్యవహరించాను. తొలి సినిమానే అయినప్పటికీ, ఆయన ఆ సినిమాని అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది.
ఇప్పుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. తనతో మళ్లీ ఓ సినిమా చేయాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కాకపోతే అది కుదరడం లేదు. కానీ, నాకు మాత్రం ఇప్పటికీ ఆ ఆశ ఉంది’ అని అశ్వనీదత్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కలెక్షన్స్ గురించి కూడా అశ్వనీదత్ కామెంట్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా రూ.1150 కోట్లు వసూలు చేసిందని అశ్వనీదత్ తెలిపారు.