ఏషియన్ సురేష్ చేతికి ‘బఘీర’ తెలుగు రైట్స్

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన చిత్రం ‘బఘీర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు డా.సూరి డైరెక్ట్ చేస్తుండగా రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాపై కన్నడనాట భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. హోంబాలే ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలో ‘బఘీర’ చిత్ర తెలుగు రైట్స్‌ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సురేష్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్‌కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాలో రుక్మిణి వాసంత్, ప్రకాశ్ రాజ్, గరుడ రామ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version