ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఒకో ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీకి సంబంధించి అయితే నటులు దర్శకులు అంతా కూడా ఒకరితో ఒకరు మిళితమై భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు అంతా ఇండియన్ సినిమాగా మారిపోగా ఇప్పుడు అనౌన్స్ అవుతున్న ఒకో క్రేజీ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ హైప్ ని తీసుకొస్తుంది.
మరి అలానే ఇప్పుడు మరో మాస్ కాంబినేషన్ సంభవం అంటూ క్రేజీ న్యూస్ అయితే ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. కోలీవుడ్ సినిమా దగ్గర దర్శకుడు అట్లీ అలానే సంగీత దర్శకుడు అనిరుద్ లకి ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి ట్రాక్ రికార్డు కూడా అందరికీ తెలిసిందే.
ఇక రీసెంట్ గా వచ్చిన “జవాన్” సెన్సేషనల్ హిట్ కాగా దీనిపై అల్లు అర్జున్ మరియు సంగీత దర్శకుడు అనిరుద్ మధ్య జరిగిన ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాకు ఒక్క థాంక్స్ మాత్రమే కాదు మంచి పాటలు కూడా కావాలి అని అల్లు అర్జున్ ఇచ్చిన రిప్లైతో అయితే బన్నీ అనిరుద్ కాంబో కన్ఫర్మ్ కాగా ఇది దర్శకుడు అట్లీ తోనే సంభవం అని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మరి ఈ మాసివ్ కాంబినేషన్ పై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.
Not just simple Thank you … I want great songs too ????????
— Allu Arjun (@alluarjun) September 14, 2023