షారుఖ్ తో “జవాన్” సీక్వెల్ పై అట్లీ ఆసక్తికర కామెంట్స్ వైరల్.!

షారుఖ్ తో “జవాన్” సీక్వెల్ పై అట్లీ ఆసక్తికర కామెంట్స్ వైరల్.!

Published on Mar 22, 2024 2:57 PM IST


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నయనతార (Nayanthara) అలాగే దీపికా పదుకోణ్ (Deepika Padukone) లు హీరోయిన్స్ బాలీవుడ్ కోలీవుడ్ యంగ్ అండ్ స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో చేసిన సెన్సేషనల్ హిట్ చిత్రం “జవాన్” (Jawan Movie) కోసం తెలిసిందే. గత ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన సంచలన విజయ చిత్రాల్లో జవాన్ కూడా ఒకటి.

మరి ఈ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రానికి కూడా సీక్వెల్ (Jawan 2) ఉంటుంది అనే టాక్ కూడా ఉంది. అయితే జవాన్ కి సీక్వెల్ ఉందా లేదా అనేదానిపై లేటెస్ట్ గా అట్లీ చేసిన ఆసక్తికర కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.

ఒక్క జవాన్ చిత్రానికే కాదు నా అన్ని సినిమాల్లో కూడా ప్రతిదానికి సీక్వెల్ ఉండేలానే ఉంటుంది అని కానీ నాకెప్పుడూ వాటికి భిన్నంగా సర్ప్రైజ్ ఇవ్వడమే నచ్చుతుంది అని తెలిపాడు. అలాగే ఖచ్చితంగా మళ్ళీ షారుఖ్ తో సినిమా ఉంటుంది అని కన్ఫర్మ్ చేసాడు. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు పడుతుందో చూడాలి. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ కి అనిరుద్ సంగీతం అందించగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు