వైరల్ పిక్ : అట్లీ బర్త్ డే పార్టీ లో మెరిసిన ఇలయతలపతి, బాద్షా

Published on Sep 23, 2022 12:14 am IST

తమిళ్ మూవీ ఇండస్ట్రీ లో యువ దర్శకుడిగా మంచి పేరు దక్కించుకుని ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజక్ట్స్ తో దూసుకెళ్తున్న వారిలో అట్లీ కూడా ఒకరు. రాజారాణి మూవీతో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టిన అట్లీ ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ అందుకున్నారు. అనంతరం ఇలయతలపతి విజయ్ తో తేరి, మెర్సల్, బిగిల్ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న అట్లీ ప్రస్తుతం ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో చేస్తున్న మూవీ జవాన్. బైలింగువల్ మూవీగా ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

నయనతార ఇందులో కథానాయిక. అయితే విషయం ఏమిటంటే నిన్న అట్లీ బర్త్ డే సందర్భంగా చెన్నైలో ఎంతో గ్రాండ్ గా ఎరేంజ్ చేసిన ఆయన స్పెషల్ పార్టీకి పలువురు సినీ ప్రముఖులతో పాటు బాద్షా షారుక్ ఖాన్, ఇలయతలపతి విజయ్ ఇద్దరూ కూడా ప్రత్యేకంగా విచ్చేసారు. ఈ సందర్భంగా అట్లీ తో కలిసి వారిద్దరూ దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూసిన విజయ్, షారుఖ్ ఫ్యాన్స్ ఇద్దరూ కూడా దీనిని సోషల్ మీడియా లో మరింతగా వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :