అట్లీ, షారుక్ తో ఇలా ప్లాన్ చేయనున్నాడా..?

Published on Aug 7, 2020 9:32 pm IST


కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ పేరు మన తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితమే.. ఇళయ థలపతి విజయ్ తో తీసిన సినిమాల దెబ్బకు ఇండియా వైడ్ క్రేజ్ ను తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. సరి మోతాదులో మాస్ ఎలివేషన్ సీన్స్ మరియు సందేశంతో కూడిన సన్నివేశాలను అట్లీ తెరకెక్కించడం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీనితో బాలీవుడ్ కన్ను ఈ యంగ్ డైరెక్టర్ పై కూడా పడింది.

అందులో భాగంగా అక్కడి బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తో ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని ఆ మధ్య టాక్ వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరింత సమాచారం తెలుస్తుంది. అట్లీ ఇప్పటి వరకు థలపతి విజయ్ తో తెరకెక్కించిన సినిమాలలో ఒక హిట్ సినిమాను బాలీవుడ్ లో షారుఖ్ తో రీమేక్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి వీరిద్దరి కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More