షాప్ ఓపెనింగ్ అని పిలిచి.. ఆ పని చేయాలంటూ బాలీవుడ్ నటిపై ఒత్తిడి!

షాప్ ఓపెనింగ్ అని పిలిచి.. ఆ పని చేయాలంటూ బాలీవుడ్ నటిపై ఒత్తిడి!

Published on Mar 24, 2025 5:00 PM IST

బాలీవుడ్‌ నటిపై దాడికి పాల్పడిన ఘటన గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పైగా హైదరాబాద్‌ నగరంలో ఈ ఘటన జరగడంతో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. అసలేం జరిగింది అంటే.. ఓ బాలీవుడ్‌ / టీవీ నటి (30) ముంబయిలో ఉంటుంది. ఆమెకు ఈ నెల 17న హైదరాబాద్‌కు చెందిన ఓ స్నేహితురాలు ఫోన్‌ చేసి షాప్‌ ప్రారంభోత్సవానికి అతిథిగా రావాలని రిక్వెస్ట్ చేసింది. దీంతో సదరు నటి ఈ నెల 18న నగరానికి వచ్చింది.

ఆ నటికి మాసబ్‌ట్యాంక్‌ శ్యామ్‌నగర్‌కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో బస ఏర్పాటు చేశారు. అక్కడ ఓ వృద్ధురాలు నటికి అవసరమైన వసతులు ఏర్పాటు చేసింది. ఐతే, 21న రాత్రి 9 గంటలకు ఇద్దరు మహిళలు నటి ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి తమతో కలసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారట. అదే రోజు 11 గంటలకు ముగ్గురు పురుషులు నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఆమెపై దాడి చేశారు. కానీ బాధితురాలు గట్టిగా అరిచి, అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో మాసబ్‌ట్యాంక్‌ పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు