వైరల్..”అవతార్” సిరీస్ పై పెద్ద క్లారిటీ ఇచ్చిన జేమ్స్ కేమరూన్.!

Published on Jul 6, 2022 9:00 am IST


ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా భారీ అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి సిద్ధం అవుతున్న చిత్రం “అవతార్ 2” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు జేమ్స్ కేమరూన్ కెరీర్ లో మరో అద్భుత సృష్టి అయినటువంటి ఈ చిత్రం అప్పట్లోనే రికార్డు వసూళ్లు కొల్లగొట్టి ఇప్పటికీ చెరగని రికార్డులు నమోదు చేసింది.

అయితే ఇక ఆ సినిమాకి ఏకంగా మరో నాలుగు సీక్వెల్స్ ని కేమరూన్ అనౌన్స్ చేయగా వాటి కోసం ఓ రేంజ్ లో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక వీటిలో అవతార్ 2(ది వే ఆఫ్ ది వాటర్) ఈ ఏడాది చివరిలో రిలీజ్ అవుతుండగా ఈ సినిమాపై ప్రమోషన్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి.

అయితే ఈ గ్యాప్ లో ఈ సినిమా దర్శకుడు ఒక సెన్సేషనల్ క్లారిటీ ఇచ్చినట్టు ఓ వార్త వైరల్ అవుతుంది. తాను డైరెక్ట్ చేస్తే అవతార్ 2 మరియు 3 వరకే చెయ్యొచ్చని 4 మరియు 5 చిత్రాలకు బహుశా తాను డైరెక్ట్ చెయ్యకపోవచ్చని తెలిపారు. అయితే వాటి మీద పెట్టే టైం కన్నా తన డైరెక్షన్ లో మరో అద్భుత చిత్రాలు లైన్స్ ఉన్నాయని..

అందుకే అవతార్ సిరీస్ ని పక్కన పెట్టి వాటిని స్టార్ట్ చెయ్యడానికి తప్పుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే అవతార్ సిరీస్ ను తాను పూర్తి చేయకపోవడం ఒకింత డిజప్పాయింటింగ్ న్యూస్ అయినా తన నుంచి మరో కొత్త సినిమాలు వస్తున్నాయి అనేది ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :