ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఓటిటి ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. అయితే అప్పుడప్పుడే ఓటిటి విస్తరణ జరుగుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ పడడంతో ఒక్కసారిగా ఓటిటి రంగం ఊపందుకుంది. మరి ఒకానొక సందర్భంలో అయితే సినిమా కన్నా బెటర్ కంటెంట్ ఓటిటి లో దొరుకుతుంది అని కూడా కామెంట్స్ వచ్చాయి.
కానీ సినిమాకి మాత్రం ఓటిటి ఎప్పటికీ కాంపిటీటర్ కాదని కూడా చాలా మంది అభిప్రాయ పడతారు. ఇక ఈ ఓటిటిలపై అయితే వరల్డ్ ఫేమస్ దర్శకుడు అవతార్ లాంటి ఎన్నో వండర్స్ ఇచ్చిన జేమ్స్ కేమరూన్ తన అభిప్రాయాన్ని రీసెంట్ గా హాలీవుడ్ మీడియాతో వెల్లడించారు. కేమరూన్ తన సినిమాలు అన్నీ కూడా తనకి వచ్చిన కలల మూలానే స్టార్ట్ అయ్యినవి అని చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
టెర్మినేటర్ నుంచి అవతార్ సినిమాలు వరకు కూడా తన కలలో వచ్చిన వాటిని సినిమాగా తాను ప్రెజెంట్ చేస్తానని చెప్పుకొచ్చారు. మరి మన కలల్లో కనిపించే విజువల్స్ ముందు ఏ ఓటిటి కూడా పనికిరాదని మన కలలే నా ప్రైవేట్ స్ట్రీమింగ్ అది కూడా ప్రతీ రాత్రి ఫ్రీగా చూస్తానని తాను అభిప్రాయ పడ్డారు. దీనితో ఈ కామెంట్స్ మంచి ఆసక్తిగా మారాయి.