ఇంటర్వ్యూ : అవికా గోర్ – ‘రాజుగారి గది 3’లో కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు !

ఇంటర్వ్యూ : అవికా గోర్ – ‘రాజుగారి గది 3’లో కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు !

Published on Oct 14, 2019 5:46 PM IST

‘రాజాగారు గది’ ప్రాంచైజీలో వస్తున్న మూడవ చిత్రం ‘రాజుగారి గది 3’. హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 18న విడుదల కానుంది. అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటించగా, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కింది. మూవీ విడుదల నేపథ్యంలో హీరో అవికా గోర్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

 

తెలుగులో చాల గ్యాప్ వచ్చింది. ఈ సినిమా కాకుండా తెలుగు ఆఫర్స్ ఇంకా వచ్చాయా ?

 

వచ్చాయి. కానీ కొన్ని హిందీ సినిమాలు చేయడం వల్ల అలాగే కొన్ని కారణాల వల్ల ముఖ్యంగా ఒకేరకమైన సినిమాలు రావడంతో తెలుగు సినిమాలు ఎక్కువ చేయలేకపోయాను.

 

మరి ‘రాజుగారి గది 3’ సినిమా చేయడానికి కారణం ?

 

కారణం ఈ సినిమా దర్శకుడు ఓంకార్ గారే. ఆయన తమన్నా అనుకుని రాసుకున్న పాత్రలో నేను అయితే బాగా చేస్తానని నమ్మారు. ఆయన కథ చెప్పినప్పుడే నాకు కథ బాగా నచ్చింది. అందుకే వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను.

 

ఒక హారర్ సినిమాలో మొదటిసారి నటించారు. ఎలా అనిపించింది ?

 

పర్సనల్ గా నేను ఒంటరిగా హారర్ ఫిల్మ్స్ అసలు చూడను. ఒకవేళ చూసిన పక్కన ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ ఉంటేనే చూస్తాను. అలాంటిది ఓంకార్ గారు నాకు ఈ హారర్ కథ చెబుతున్నప్పుడే టెన్షన్ పడ్డాను. కానీ కథలో మంచి కామెడీ ఉంటుంది. కథ వింటున్న అన్నంతసేపూ నేను నవ్వుతూనే ఉన్నాను.

 

పోస్టర్ లోనే మీ లుక్ చాల భయం కలిగించేలా ఉంది. అది చూసినపుడు మీకెలా అనిపించింది ?

 

మేకప్ వేసుకునప్పుడే నన్ను నేను చూసుకుంటున్నాను. పోస్టర్ లో చూసినప్పుడు నాకు మామూలుగానే ఉంది. అయితే ఆ లుక్ లో నన్ను చూసి మా పేరెంట్స్ షాక్ అయ్యారు. కానీ కథ తెలిసాక మళ్ళీ కామ్ అయ్యారు.

 

సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

 

సినిమాలో నా క్యారెక్టర్ వెరీ సింపుల్ అండి. గర్ల్ నెక్స్ట్ డోర్ లా ఉంటుంది.

 

సినిమాలో బాగా ఆకట్టుకునే అంశాలు ఏమిటి ?

 

ఈ సినిమాలో కామెడీ చాల కొత్తగా అలాగే అద్భుతంగా ఉంటుంది. సినిమా చూస్తూ ఉన్నంత సేపూ కామెడీని మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అలాగే సినిమాలో డైలాగ్స్ అండ్ మ్యూజిక్ ఇలా అన్ని బాగుంటాయి. ఒక్కమాటలో ప్రేక్షకులకు కావలసిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మూవీతో ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాం.

 

తెలుగు డైలాగ్స్ మీకు అర్ధం అవుతాయా ?

 

అర్ధం అవుతాయి కానీ, త్వరగా మాట్లాడలేను.

 

తమన్నా చేయాల్సిన పాత్రను మీరు చేశారు. నటనలో ఆమెతో పోల్చి చూస్తారనే టెన్షన్ ఉందా ?

 

లేదు అండి. ఏ క్యారెక్టర్ అయినా దాన్ని ఎవరు చేసినా దర్శకుడి అభిరుచికి తగ్గట్లే చేస్తారు. కాకపోతే, ఎవరి శైలి వారిది. నా వరకూ నేను ఈ సినిమా కోసం సిన్సియర్ గా వర్క్ చేశాను. అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను.

 

మీ తదుపరి సినిమాలు ఏమిటి ?

 

బాలీవుడ్ లో యాక్ట్ చేస్తున్నాను, అలాగే హిందీ టీవీలో చేస్తున్నాను. ఇక నుండి తెలుగు మూవీస్ లో కూడా ఎక్కువుగా కనిపిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు