అవైటెడ్ “బేబీ” సెకండ్ సింగిల్ కి డేట్ ఫిక్స్.!

అవైటెడ్ “బేబీ” సెకండ్ సింగిల్ కి డేట్ ఫిక్స్.!

Published on Mar 29, 2023 3:30 PM IST

గత కరోనా సమయంలో ఓటిటి లో వచ్చిన స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం “కలర్ ఫోటో” ఎంత పెద్ద సక్సెస్ అయ్యి ఆ సినిమా రచయిత అయినటువంటి సాయి రాజేష్ కి నేషనల్ స్థాయి గుర్తింపుని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ రచయిత నుంచి తాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మరో అద్భుతమైన ప్రేమ కతా చిత్రం “బేబీ”.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ నే సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అయ్యింది. దీనికి ఇక రెండో సాంగ్ కోసం అప్పటి నుంచి మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. దీనితో ఎట్టకేలకి అయితే మేకర్స్ ఈ అప్డేట్ ని ఈరోజు రివీల్ చేశారు.

ఈ సినిమాలో రెండో సాంగ్ అయితే “దేవ రాజా” కాగా దీనిని కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రచించగా విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఇక ఈ సాంగ్ అయితే ఈ ఏప్రిల్ 3న రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి దీనిపై డిజైన్ చేసిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఈ సాంగ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి.

https://twitter.com/sairazesh/status/1640999682246873088?s=20

సంబంధిత సమాచారం

తాజా వార్తలు