ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన క్రేజీ సిరీస్ “ది బాయ్స్ సీజన్ 4”.. కానీ

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన క్రేజీ సిరీస్ “ది బాయ్స్ సీజన్ 4”.. కానీ

Published on Jun 13, 2024 1:05 PM IST


ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న పలు సెన్సేషనల్ హిట్ సిరీస్ లలో ప్రముఖ ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చిన సూపర్ హీరో జానర్ సిరీస్ గా వచ్చిన ఆ సిరీస్ నే “ది బాయ్స్”. కార్ల్ అర్బన్, జాక్ క్వాయిడ్, ఆంటోనీ స్టార్, ఎరిన్ మోరియార్టీ, డొమినిక్ మెక్‌ఎల్లిగాట్, జెస్సీ అషర్, లాజ్ అలోన్సో, చేస్ క్రాఫోర్డ్, టోమర్ కాపోన్, కరెన్ తదితర ప్రముఖ నటులు నటించిన ఈ సిరీస్ ఆడియెన్స్ లో సాలిడ్ హిట్ అయ్యింది.

మరి ఇప్పుడు వరకు మొత్తం 3 సీజన్లలను పూర్తి చేసుకోగా నాల్గవ సీజన్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే ప్రైమ్ వీడియో వారు ఫైనల్ గా సీజన్ 4 ని ఈ జూన్ 13 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేసారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఈ సిరీస్ మొత్తం 30 భాషలకి పైగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేయగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకి మన దేశంలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

మరి మన దేశంలో ఈ సిరీస్ మొత్తం పాన్ ఇండియా భాషలు 5 సహా ఇతర 5 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కానీ ఇక్కడ అనుకున్నట్టు గానే మొత్తం సిరీస్ ఎపిసోడ్స్ ని రిలీజ్ చేయలేదు. కేవలం 3 ఎపిసోడ్స్ ని మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేయగా మిగతా ఎపిసోడ్స్ ఒకొకటిగా ఒకో వారం అందుబాటులోకి రానున్నాయి. మరి రక్త సిక్తంగా సాగే ఈ అడల్ట్ రేటెడ్ సిరీస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ సిరీస్ ని ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు