క్రేజీ బీట్స్ తో ట్రీట్ ఇచ్చేలా “గాడ్ ఫాథర్” అవైటెడ్ ఫస్ట్ సాంగ్.!

Published on Sep 21, 2022 4:37 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా “గాడ్ ఫాథర్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. దీనితో హిందీ తెలుగులో కూడా మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.

అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ బాగా ఊరిస్తూ వస్తుంది. మరి ఇప్పటివరకు వెయిట్ చేసిన ఎదురు చూపులకి గాను ఇది పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పాలి. థమన్ ఇచ్చిన అదిరే బీట్స్ అలాగే సాంగ్ విజువల్స్ కూడా సూపర్బ్ గా కనిపించాయి. అలాగే ఇద్దరు హీరోలపై డిజైన్ చేసిన లిరిక్స్ కూడా కరెక్ట్ గా సెట్టయి సాంగ్ కి అదనపు హంగుని తీసుకొచ్చాయి.

ఇక సాంగ్ లో అయితే చిరు మరియు సల్మాన్ లతో పాటు సాంగ్ డైరెక్టర్ ప్రభుదేవా కూడా కనిపించిన ఫ్రేమ్ అయితే థియేటర్స్ లో దద్దరిల్లడం ఖాయంలా కనిపిస్తుంది. ఇంకా ఈ లిరికల్ వీడియో డిజైన్ చేసిన వాల్ ట్రెండ్స్ వారి స్టైలింగ్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఓవరాల్ అయితే గాడ్ ఫాథర్ ఫస్ట్ సింగిల్ స్యూర్ షాట్ చార్ట్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రాన్ని అయితే సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించగా అక్టోబర్ 5న ఈ చిత్రం తెలుగు, హిందీలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

తార్ మార్ తక్కర మార్ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :