ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అవైటెడ్ “కిల్”

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అవైటెడ్ “కిల్”

Published on Sep 6, 2024 7:06 AM IST

రీసెంట్ గా బాలీవుడ్ సినిమాని షేక్ చేసిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో లక్ష్య నటించిన సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కిల్” కూడా ఒకటి. చిన్న సినిమాగా వచ్చి బాలీవుడ్ టు హాలీవుడ్ హాట్ టాపిక్ గా ఈ చిత్రం మారింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో వచ్చిన తర్వాత చాలా మంది ఓటీటీ రిలీజ్ కోసం కూడా ఎదురు చూస్తూ వచ్చారు. కానీ ఈ చిత్రం ఓటీటీలో మొదటగా యూఎస్ మార్కెట్ లో ప్రైమ్ వీడియోలో వచ్చింది.

మరి ఇండియాలో ఎప్పుడు అనుకుంటున్న సమయంలో ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు డేట్ ని అనౌన్స్ చేసేసారు. ఇక ఫైనల్ గా ఈ చిత్రం నేటి నుంచి హాట్ స్టార్ లో రిలీజ్ కి వచ్చేసింది. అయితే కేవలం హిందీలో మాత్రమే వచ్చిన ఈ క్రేజీ బ్లడ్ యాక్షన్ డ్రామాని చూడాలి అనుకునేవారు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టి చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి నిఖిల్ నగేష్ దర్శకత్వం వహించగా తన్య మనిక్తలా హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు