ఈ కొత్త ఏడాదిలో సంక్రాంతి కానుకగా పలు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో అనూహ్యంగా వెంకీ మామ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం ఊహించని రన్ తో ఏకంగా రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయ్యి అదరగొట్టింది. అలాగే దర్శకుడు అనీల్ రావిపూడి కెరీర్లో కూడా ఇదే బిగ్గెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచి సెన్సేషన్ ని సెట్ చేసింది. మరి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేటర్స్ లో అదరగొట్టి ఇపుడు ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది.
ఈ సినిమా ఓటిటి హక్కులు జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో నేడు సాయంత్రం 6 గంటల నుంచి సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసింది. ఇందులో ఒరిజినల్ తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషలు అన్నిటిలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో కూడా వచ్చేసింది. మరి నవ్వుల ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని చూడాలి అనుకుంటే జీ5లో ఇక ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు, శిరీష్ లు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.