Suzhal 2 OTT: ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అవైటెడ్ “సుజల్ 2”

Suzhal 2 OTT: ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అవైటెడ్ “సుజల్ 2”

Published on Feb 28, 2025 7:01 AM IST

మన ఇండియన్ ఓటీటీ దగ్గర కూడా పలు క్రేజీ ఓటీటీ కంటెంట్ హిట్ అయ్యినవి ఉన్నాయి. అవి ఒరిజినల్ సినిమాలు అయినా అలాగే వెబ్ సిరీస్ లు అయినా కూడా అని చెప్పవచ్చు. అయితే సాలిడ్ వెబ్ సిరీస్ లు మాత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఎక్కువగా కనిపిస్తాయి. ఇలా హిందీ సహా సౌత్ లో కూడా పలు భాషల్లో సూపర్ హిట్ వెబ్ సిరీస్ లు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వచ్చినవి ఉన్నాయి.

మరి ఇలా హిట్ అయ్యి రెండో సీజన్ కోసం ఎదురు చూస్తున్న మరో సిరీస్ నే సుజల్ సీజన్ 2. కొన్నేళ్ల కితం ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయ్యిన ఈ సిరీస్ కి సీజన్ 2 ఫైనల్ గా నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. నటి ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ థ్రిల్లర్ మిస్టరీ సిరీస్ మొత్తం పాన్ ఇండియా భాషల్లో 8 ఎపిసోడ్స్ గా మేకర్స్ తీసుకొచ్చారు. మరి ఎవరైనా చూడాలి అనుకుంటే ఇప్ఫుడు ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు