కోలీవుడ్ యువ నటుడు శివకార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయలాన్. కెజెఆర్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ ఎక్స్ స్టూడియోస్, ఆదిబ్రహ్మ ప్రొడక్షన్స్ సంస్థల పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ మూవీ ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి అక్కడి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సంపాదించి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది.
తాజాగా ఈ మూవీ తమిళ్ వర్షన్ లో వరల్డ్ వైడ్ గా రూ. 75 గ్రాస్ కలెక్షన్ ని దాటేసినట్లు మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ ద్వారా ప్రకటించారు. దానితో అయలాన్ తెలుగు వర్షన్ పై అందరిలో మరింతగా ఆసక్తి ఏర్పడింది. నేడు జరిగిన ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివకార్తికేయన్ మూవీ తెలుగు వర్షన్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.