‘స్వయంభు’ సెట్స్‌లో ఆయుధ పూజ వేడుకలు

‘స్వయంభు’ సెట్స్‌లో ఆయుధ పూజ వేడుకలు

Published on Oct 11, 2024 7:11 PM IST

యంగ్ హీర నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడిక్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ ఓ యోధుడి పాత్రలో నటిస్తున్నట్లుగా ఈ చిత్ర పోస్టర్స్, చూస్తే అర్థమవుతోంది. కాగా, ఈ సినిమా నుండి తాజాగా ఓ మేకింగ్ వీడియోను వదిలారు మేకర్స్.

దసరా పండుగ సందర్భంగా ఈ చిత్ర సెట్స్‌లో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సెట్స్‌లో ఉన్నవారు తమ ఆయుధాలను తీసుకొచ్చి దుర్గామాత విగ్రహం ముందు పూజించారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో నిఖిల్ ఓ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్, శ్రీకార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు