దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఇండియన్ సినిమాలో ఓ ప్రభంజనం సృష్టించిన ‘బాహుబలి’ సినిమాకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌కు ఓ సరికొత్త మార్గాన్ని సూచించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఇక సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఏపాటిదో చెప్పడానికి సినిమాకొచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు చాలు. కాగా ఈ సినిమా ప్రేక్షకుల్లో, ముఖ్యంగా యూత్‌లో ఏ స్థాయి క్రేజ్ సంపాదించుకుందో తెలపాలంటే ఆన్‌లైన్ లెక్కలే కొలమానం.
తాజాగా ఈ లెక్కల్లో దేశంలో వేరే ఏ ఇతర సినిమాకూ దక్కని ఓ స్పెషల్ స్టేటస్ బాహుబలికి దక్కింది. ఫేస్‌బుక్ 2015లో ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలను కొద్దిసేపటిక్రితం ప్రకటించింది. నరేంద్ర మోడీ, బీహార్ ఎన్నికలు.. తదితర టాప్ 10 అంశాల్లో ‘బాహుబలి’ నాలుగవ స్థానాన్ని సొంతం చేసుకొని ఈ సినిమాకు ఆన్‌లైన్‌లో ఏ స్థాయి క్రేజ్ ఉండిందో ఋజువు చేసింది. ఈ లిస్ట్‌లో దేశవ్యాప్తంగా ఒక్క సినిమా కూడా లేకపోవడం ఇక్కడ ప్రస్తావిందగ్గ విషయం.