బాహుబలి చిత్రాలతో భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి బిగినింగ్ కి ప్రీక్వెల్ ను బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరిట యానిమేటెడ్ సిరీస్ గా తెరకెక్కించారు మేకర్స్. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ లో ఈ యానిమేటెడ్ సిరీస్ మే 17 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. ఈ సిరీస్ కి సంబందించిన తెలుగు ట్రైలర్ ను విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు ఈ సిరీస్ కోసం మీడియా తో మేకర్స్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
9 ఎపిసోడ్ లు కలిసి ఉన్న ఈ సిరీస్ అత్యంత ఆసక్తికరం గా సాగనుంది. కట్టప్ప, బాహుబలి ను ఎందుకు చంపాడు అనే తరహాలో, సిరీస్ చివరలో ఎలాంటి క్లూ లేని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ముగియనుంది. దీన్ని బట్టి, సెకండ్ సీజన్ కి ఆస్కారం ఉంది. ఈ సిరీస్ లో బాహుబలి, భళ్లాల దేవ వీరోచిత ప్రదర్శనలు ఉన్నాయి. రక్తదేవ్ అనే పాత్ర ఎంటర్ టైనింగ్ గా సాగనుంది. ది లెజండ్ ఆఫ్ హనుమాన్ ను తెరకెక్కించిన కంగ్ మరియు నవీన్ జాన్ లు ఈ సిరీస్ కి దర్శకత్వం వహించగా, రాజమౌళి, శోభు యార్లగడ్డ, దేవరాజన్ లు నిర్మించారు. ఈ సిరీస్ తెలుగు లో కూడా అందుబాటులోకి రానుండటం తో బాహుబలి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.