సమీక్ష: బాపు – కొంతమేర మెప్పించే విలేజ్ డ్రామా

సమీక్ష: బాపు – కొంతమేర మెప్పించే విలేజ్ డ్రామా

Published on Feb 22, 2025 3:02 AM IST

Baapu Movie Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 21, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : బ్రహ్మాజీ, ఆమని, సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, శ్రీనివాస్ అవసరాల, రచ్చ రవి తదితరులు
దర్శకుడు : కే దయాకర్ రెడ్డి
నిర్మాణం : కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
సంగీతం : ఆర్ ఆర్ ధృవన్
సినిమాటోగ్రఫీ : వాసు పెండెం

కూర్పు : ఆలయం అనీల్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మంచి ప్రమోషన్స్ నడుమ వచ్చిన చిత్రం “బాపు” కూడా ఒకటి. సీనియర్ నటుడు బ్రహ్మాజీ, ఆమని అలాగే ‘బలగం’ నటుడు సుధాకర్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథ లోకి వస్తే.. తెలంగాణలోనే ఒక కుగ్రామంలో గుప్త నిధులు నమ్మే జేసీబీ ఆపరేటర్ చంటి(రచ్చ రవి) తనకి దొరికిన బంగారు విగ్రహంతో సొంతంగా రెండు జేసీబీలు కొనేసి సెటిల్ అయ్యిపోవాలి అని చూస్తాడు. అయితే తనకి దొరికిన అమ్మవారు బంగారు ప్రతిమ తన నుంచి మిస్సవుతుంది. ఇంకోపక్క అదే ఊరిలో ఉన్న పత్తి రైతు మల్లయ్య(బ్రహ్మాజీ) తన నాన్న రాజయ్య(సుధాకర్ రెడ్డి), భార్య సరోజ (ఆమని) అలాగే తన పిల్లలతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటు జీవితాన్ని అప్పుల బాధలతో నెట్టుకొస్తారు. అయితే ఓ పక్క చంటి నుంచి దూరమయ్యిన బంగారు విగ్రహం ఏమయ్యింది? కష్టాల్లో ఉన్న మల్లయ్య కుటుంబం తమ ఇంటి పెద్ద రాజయ్యని ఎందుకు చంపాలి అనుకుంటారు అనే అంశాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఏ అంచనాలు లేకుండా ఈ సినిమాని ట్రై చేసేవారికి బాపు డీసెంట్ ట్రీట్ ఇస్తుంది అనిక్ చెప్పవచ్చు. తెలంగాణ నేపథ్యంలో నడిచే ఈ చిన్నపాటి విలేజ్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ థ్రిల్ ఎలిమెంట్స్ సాలిడ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్స్ స్టార్ట్ తో మొదలయ్యే ఈ చిత్రం అలా కొనసాగుతున్న కొద్ది డీసెంట్ ట్రీట్మెంట్ తో ముందుకు వెళుతుంది.

అలాగే సినిమాకి ఇచ్చిన ఒక పొయెటిక్ ఎండింగ్ దర్శకుడు చెప్పాలి అనుకున్నది ప్రతిబింబించేలా ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా చూపిస్తుంది. మనది కానిది మనకి అర్హత లేనిది మన దగ్గరకి రాదు అనే పాయింట్ ని మంచి థ్రిల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ తో అందులో డీసెంట్ ఎమోషన్స్ జోడించి దర్శకుడు ఇంప్రెస్ చేశారు. ఇక నటీనటుల్లో బ్రహ్మాజీ నుంచి ఒక ఫ్రెష్ పెర్ఫామెన్స్ అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో చూసిన చాలా పాత్రలకి ఇది భిన్నం, ఇందులో అన్ని ఎమోషన్స్ ని బ్రహ్మాజీ బ్రహ్మాండంగా పలికించారు.

అలాగే తనతో పాటుగా ఆమని కూడా మెప్పించారు. వీరి పిల్లలుగా నటించిన ధన్య బాలకృష్ణ, తన తమ్ముడు మణి ఎగుర్ల మంచి నటన కనబరిచారు. అలాగే వీరి నడుమ సాగే కొన్ని కామెడీ సీన్స్ ఇంకా ఎమోషనల్ సీన్స్ సినిమాలో వర్క్ అవుతాయి. వీరితో పాటుగా బలగం నటుడు సుధాకర్ రెడ్డి మరో మంచి ప్లస్ అని చెప్పవచ్చు. కొన్ని సీన్స్ తో తన కామెడీ టైమింగ్ హిలేరియస్ గా వర్క్ అయ్యింది. అలాగే శ్రీనివాస్ అవసరాల తన రోల్ కి ఫిట్ అయ్యారు. రచ్చ రవి కూడా మంచి పెర్ఫామెన్స్ ని సినిమాలో అందించారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో డీసెంట్ లైన్ ఉంది కానీ దీనిని ఇంకా ఎంగేజింగ్ గా డీల్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొన్ని ఎమోషన్స్ వరకు బాగానే ఉన్నా ఫస్టాఫ్ లో కథనం మాత్రం మరీ మెప్పించే రేంజ్ లో అనిపించదు. పైగా తన తండ్రినే హత మార్చాలి అనే పాయింట్ చాలా సిల్లీగా అనిపిస్తుంది.

ఇదైతే అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఇక దీనితో పాటుగా చాలా చోట్ల కథనం నెమ్మదిగా అక్కడక్కడా ఊహాజనితంగానే అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో యువ నటుడు మణి ఎగుర్లకి ఆ లవ్ ట్రాక్ మధ్యలో వచ్చే ఆ లవ్ సాంగ్స్ అనవసరంగా పెట్టారు అనిపిస్తుంది. ఇవి తీసి మిగతా సినిమా కొనసాగించినా ఇంపాక్ట్ బాగుండేది.

మధ్యలో ఈ ట్రాక్స్ ఫ్లోని దెబ్బ తీసినట్టుగా అనిపిస్తాయి. అలాగే సినిమాలో పాయింట్ కూడా ఒక టైం లో మరీ కొత్తగా కూడా అనిపించదు ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’ అనే సినిమాలో ఒక లాటరీ టికెట్ కోసం జరిగే వెతుకులాట తరహాలో ఈ సినిమాలో అక్కడక్కడా షేడ్స్ కనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా సహజమైన లొకేషన్స్ లోనే సినిమా తీయడంతో చిత్రం చాలా నాచురల్ గా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగే టెక్నికల్ టీంలో ఆర్ ఆర్ ధృవన్ ఇచ్చిన స్కోర్ బాగుంది. పాటలు కూడా ఓకే. వాసు పెండెం ఇచ్చిన విజువల్స్ బాగున్నాయి. ఆలయం అనీల్ ఎడిటింగ్ లో కొన్ని సన్నివేశాలు తగ్గించాల్సింది.

ఇక దర్శకుడు కే దయాకర్ రెడ్డి విషయానికి వస్తే.. తాను కొన్ని పల్లెటూరు ఎమోషనల్ సినిమాలకి డిఫరెంట్ గా మధ్యలో కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేయడం అనేది బాగుంది. అలాగే దీనికి అనుగుణంగా అల్లుకున్న కథనం కూడా బాగుంది. కాకపోతే కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి, వీటిని మినహాయిస్తే బాగున్ను. ఓవరాల్ గా తన వర్క్ సినిమాకి బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “బాపు”లో డీసెంట్ లైన్ ఉన్నప్పటికీ ఇంకా ఎంగేజింగ్ గా సాగే కథనం అవసరం ఉంది. కొన్ని కామెడీ సీన్స్, ఎమోషన్స్ వర్క్ అయ్యాయి కానీ అదే రీతిలో పలు బోరింగ్ సీన్స్, అవసర సన్నివేశాలూ ఉన్నాయి. వీటితో కేవలం కొంతమేర మాత్రమే ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది

123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు