అన్నపూర్ణ స్టూడియో లో ’బాబు బంగారం’..

అన్నపూర్ణ స్టూడియో లో ’బాబు బంగారం’..

Published on Apr 5, 2016 12:57 PM IST

babu-banagaram
వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వం లో వస్తున్న ’బాబు బంగారం’ సినిమా చిత్రీకరణ చివరిదశకు వచ్చిన విషయం తెలిసిందే. మాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతున్నట్లు సమాచారం. పదిరోజుల పాటు జరుగుతున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలిసింది.

ఈ షెడ్యూల్ తరువాత బాబు బంగారం టీం ఫారిన్ షెడ్యూల్ లో రెండు పాటల చిత్రీకరిస్తారు. ఆ పాటల చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సితార క్రియేషన్స్‌తో కలిసి సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని తెలుగు సంవత్సరాది అయిన ఉగాది రోజున విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నయనతార నటిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు