“గూఢచారి 2″లోకి ‘బేబీ జాన్’ బ్యూటీ.. గ్లింప్స్ పై కూడా అప్డేట్

“గూఢచారి 2″లోకి ‘బేబీ జాన్’ బ్యూటీ.. గ్లింప్స్ పై కూడా అప్డేట్

Published on Jan 7, 2025 12:04 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో తన సినిమాలతో ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న హీరో అడివి శేష్ కూడా ఒకరు. మరి శేష్ హీరోగా ఇపుడు గ్యాప్ తీసుకొనే వస్తున్న రెండు సినిమాలు ప్రస్తుతం తెరకెక్కిస్తుండగా ఆ చిత్రాల్లో తన అవైటెడ్ సీక్వెల్ చిత్రం “గూఢచారి 2” కూడా ఒకటి. పార్ట్ 1 సాలిడ్ హిట్ కాగా తెలుగు ఆడియెన్స్ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తుండగా ఇపుడు ఈ సినిమాపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

ఇక ఈ సినిమాలో ఓ సాలిడ్ ఎడిషన్ వచ్చినట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి యాడ్ అయ్యినట్టుగా తనపై ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేసి తెలిపారు. మరి రీసెంట్ గానే బేబీ జాన్ సినిమాలో ఈమె షైన్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ సినిమాలో ఐ మిషన్ కోసం చేరిందని చెప్పాలి. ఇక ఈ సీక్వెల్ తాలూకా గ్లింప్స్ ని ఈ జనవరి ఎండింగ్ లోనే ఇస్తున్నట్టుగా కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు