వరల్డ్ వైడ్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకున్న “బేబి”

వరల్డ్ వైడ్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకున్న “బేబి”

Published on Jul 15, 2023 3:02 PM IST

లేటెస్ట్ గా మన టాలీవుడ్ లో మంచి బజ్ తో వచ్చిన యూత్ ఫుల్ డ్రామా చిత్రమే “బేబి”. దర్శకుడు, రచయిత సాయి రాజేష్ నుంచి వచ్చిన ఈ హార్డ్ హిట్టింగ్ లవ్ డ్రామాలో అయితే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లు మెయిన్ లీడ్ లో అయితే నటించారు. మరి ఈ చిత్రం మొదటి షోస్ తోనే సాలిడ్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకోగా ఈ చిత్రం అయితే ఒక్కసారిగా బాక్సాఫీస్ దగ్గర ఊపందుకుంది.

దీనితో డే 1 కి హౌస్ ఫుల్స్ పడగా ఇప్పుడు అయితే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఈ చిన్న సినిమా పెద్ద నంబర్స్ నే సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి మేకర్స్ చెప్తున్నా నెంబర్ ప్రకారం అయితే 7.1 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా నమోదు చేసినట్టుగా తెలిపారు. ఇక దీనితో అయితే సాలిడ్ వీకెండ్ కూడా సినిమాకి ఉందని చెప్పాలి. మరి ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా మాస్ మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు