టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో అల్లరి నరేష్ కూడా ఒకరు. కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా పలు సీరియస్ టోన్ ఉన్న సినిమాలు కూడా చేసి మెప్పించిన తన నుంచి రీసెంట్ గా వచ్చిన లేటెస్ట్ చిత్రమే “బచ్చల మల్లి”. దర్శకుడు సుబ్బు మంగదెవ్వి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ చిత్రంతో నటుడుగా మంచి గుర్తింపు తాను తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో అనుకున్న రేంజ్ హిట్ కాలేదు.
మరి లేటెస్ట్ గా ఈ సినిమా ఓటిటిలో అయితే రిలీజ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు మొత్తం మూడు ఓటిటి సంస్థలు తీసుకోగా వాటిలో ఈటీవీ విన్ వారు నేడు జనవరి 10 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తామని కన్ఫర్మ్ చేశారు. అయితే దీనితో పాటుగా ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో అలాగే సన్ నెక్స్ట్ లో కూడా నేడే వచ్చేసింది. సో అప్పుడు ఈ సినిమాని చూడని వారు ఇపుడు వీటిలో ట్రై చేయవచ్చు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి