సమీక్ష : “బచ్చల మల్లి” – కొన్ని ఎమోషన్స్ వరకు ఓకే అనిపిస్తుంది

సమీక్ష : “బచ్చల మల్లి” – కొన్ని ఎమోషన్స్ వరకు ఓకే అనిపిస్తుంది

Published on Dec 20, 2024 3:05 PM IST
Bachhala Malli Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 20, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, హరితేజ, ప్రవీణ్, అచ్యుత్, కోట జవరం, అంకిత్ కొయ్య, ప్రసాద్ బెహర, హర్ష చెముడు

దర్శకుడు : సుబ్బు మంగదేవ్వి

నిర్మాతలు : రాజేష్ దండ, బాలాజీ గుట్ట

సంగీత దర్శకుడు : విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫీ : చోటా కె ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన ట్రాక్ మార్చి ఇపుడు పలు సీరియస్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా తను చేసిన లేటెస్ట్ చిత్రమే “బచ్చల మల్లి”. మరి ప్రమోషనల్ కంటెంట్ తో బాగానే బజ్ అందుకున్న ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. ఈ సినిమా 1995 నుంచి 2005 మధ్యలో నడిచే సెటప్ తో కనిపిస్తుంది. తుని, సూరవరం ప్రాంతంలో ఒక పక్కా మొరటుగా పూర్తిగా మూర్ఖత్వంతో నడిచే బచ్చల మల్లి(అల్లరి నరేష్) కనిపిస్తాడు. అయితే తన జీవితంలో ఇలా ఎందుకు మారిపోయాడు? తన జీవితంలో ఎంతగానో ప్రేమించిన కావేరి(అమృత అయ్యర్) తో తన ప్రేమ కథ ఏమయ్యింది? అంత మూర్ఖత్వం మూలాన తను కోల్పోయింది ఏంటి? ఈ క్రమంలో తన కథకి వచ్చిన ముగింపు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ మధ్య తన ట్రాక్ మార్చిన అల్లరి నరేష్ మరోసారి సాలిడ్ రోల్ ని ఎంచుకున్నారు అని చెప్పాలి. ఈ సినిమాలో బచ్చల మల్లి అనే పాత్రలో తను ఒడిగిపోయాడు అని చెప్పొచ్చు. తన పాత్రలో మొరటుతనం ముఖ్యంగా మూర్ఖత్వం అనే ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా చేసి చూపించారు. తన మూర్ఖత్వంపై కనిపించే చాలా సీన్స్ సినిమాలో ఇంప్రెస్ చేస్తాయి.

అలాగే హీరోయిన్ అమృత అయ్యర్ తన రోల్ లో బాగా చేసింది. ఇంకా ఇద్దరి నడుమ లవ్ ట్రాక్ కూడా బాగుంది. ఒక పాయింట్ లో ఇద్దరు నడుమ కనిపించే ప్రేమ వర్సెస్ మూర్ఖత్వం పాయింట్ సినిమాలో మెప్పిస్తుంది అని చెప్పాలి. ఇంకా ఇద్దరి నడుమ కెమిస్ట్రీ సినిమాలో బాగింది.

ఇక ఇంకా ఇంట్రెస్టింగ్ గా సినిమాలో కనిపించిన ప్రధాన పాత్రధారులు అంతా మంచి పాత్రలు చేశారు. ప్రతీ చిన్న పెద్ద నటునికి ఈ సినిమాలో మంచి స్కోప్ కనిపిస్తుంది. నటి రోహిణి ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో మరోసారి ఆకట్టుకున్నారు. అలాగే కోటా జవరం, నటుడు అచ్యుత్ ముఖ్యంగా రావు రమేష్ లు అయితే సాలిడ్ పెర్ఫార్మన్స్ ని కనబరిచారు. ఇంకా సినిమాలో సెకండాఫ్ లో కొన్ని ట్విస్ట్ లు క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది కానీ అందులో ఇంకొంచెం క్లారిటీ ఉండుంటే బాగుండు అనిపిస్తోంది. అలాగే ఈ కథ కూడా మరీ అంత కొత్తగా కూడా అనిపించదు. పలు సన్నివేశాలు రెగ్యులర్ గానే అనిపిస్తాయి. ఇంకా పలు సన్నివేశాలు ముందే ఊహించే రకంగానే అనిపిస్తాయి.

వీటితో పాటుగా హీరో రోల్ కి తన మూర్ఖత్వ ధోరణి ఎందుకు పతాక స్థాయిలోకి వెళ్ళింది అనేది ఒకో టైంలో కొంచెం ఓవర్ గా పోతున్నట్టు పక్క దారి పట్టినట్లు అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటి మాత్రం డెఫినెట్ గా అందరికీ ఎక్కకపోవచ్చు. అల్లరి నరేష్ పై చూపించే ఒక విషాదాంతం కొంచెం ఫోర్స్డ్ గా అర్ధ రహితంగా అనిపిస్తుంది. ఇది కొంచెం వేరేలా పెట్టి తన పాత్రకు ఒక సరైన ముగింపు ఇచ్చి ఉండుంటే బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు కానీ చాలా సీన్స్ లో వి ఎఫ్ ఎక్స్ వీక్ గా ఉండడం మూలాన బ్యాక్గ్రౌండ్ లో విలేజ్ నేటివిటీలో సహజత్వం లోపించినట్టుగా కనిపిస్తుంది. ఇక విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన కొన్ని పాటలు నేపథ్య సంగీతం బాగున్నాయి. రిచర్డ్ ఎం నాథన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ బాగుంది. పాతకాలం నాటి విజువల్స్ ని సినిమా నేపథ్యంకి తగ్గట్టుగా బాగా చూపించారు. ఇంకా ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు సుబ్బు మంగదేవ్వి విషయానికి వస్తే.. తన కథలో కోర్ పాయింట్ బాగుంది. అల్లరి నరేష్ రోల్ ని సాలిడ్ గా ప్రెజెంట్ చేశారు. ఒక పక్కా మూర్ఖుడు ఎలా ఉంటాడో ఎలా మసులుతాడో తను బాగా చూపించారు. అలాగే తన మూర్ఖత్వం మూలాన ఏమేం కోల్పోతాడో తను ఎమోషనల్ గా ఇంకా డీసెంట్ లవ్ స్టొరీతో హ్యాండిల్ చేయడం బాగుంది కానీ ఇంకొంచెం డెప్త్ గా సినిమాని హ్యాండిల్ చేయాల్సింది. అలాగే క్లైమాక్స్ ని కూడా వేరే రకంగా డిజైన్ చేసి ఉండుంటే బాగుండు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బచ్చల మల్లి” మాస్ గా కనిపించే ఎమోషనల్ మూర్ఖుడు కథ అని చెప్పొచ్చు. తన రోల్ లో నరేష్ సాలిడ్ పెర్ఫార్మన్స్ అందించారు. తన రోల్ కి పూర్తి న్యాయం తను చేయగా సినిమాలో తన పాత్ర దాని చుట్టూ సాగే ఎమోషన్స్ ఇంప్రెస్ చేస్తాయి. కాకపోతే ఇంకొంచెం డెప్త్ ని తన రోల్ లో చూపించి ఉండాల్సింది అలాగే క్లైమాక్స్ కూడా అలాంటి ముగింపు ఇచ్చి ఉండాల్సింది కాదు అనిపించింది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు