రీసెంట్ గా కన్నడ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో రోరింగ్ స్టార్ శ్రీమురళీ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రం “బఘీర” కోసం తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ కథతో దర్శకుడు తెరకెక్కించిన ఈ సెమీ సూపర్ హీరో చిత్రం అనుకున్న రేంజ్ హిట్ కాలేదు. మరి ఈ చిత్రం గత కొన్ని రోజులు కితమే దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో సౌత్ భాషలో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే హిందీ రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ లేదు.
మరి ఫైనల్ గా ఇపుడు హిందీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. అయితే ఈ హిందీ వెర్షన్ లో బఘీర నెట్ ఫ్లిక్స్ లో కాకుండా డిస్నీ+ హాట్ స్టార్ వారు దీనిని అనౌన్స్ చేశారు. ఈ చిన్మయి హిందీలో ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి హిందీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా కేజీయఫ్, సలార్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిలిమ్స్ వారు నిర్మాణం వహించారు.