దీపావళి కానుకగా రానున్న ‘బఘీర’

దీపావళి కానుకగా రానున్న ‘బఘీర’

Published on Sep 11, 2024 8:31 PM IST

ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ హొంబాలె ఫిలింస్ బ్యానర్ నుంచి వచ్చే చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాల్లో కంటెంట్ అలా ఉంటుందని అభిమానులు ఆశిస్తుంటారు. ఇక ఈ బ్యానర్ నుంచి ఇప్పుడు మరో పవర్‌ఫుల్ మూవీ రానుంది.

కన్నడ హీరో శ్రీమురళి నటిస్తున్న ఈ సూపర్ హీరో మూవీకి ‘బఘీర’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే, ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కథను అందించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు