గ్రాండ్‌గా “బహిర్భూమి” ఫస్ట్ లుక్ లాంచ్

గ్రాండ్‌గా “బహిర్భూమి” ఫస్ట్ లుక్ లాంచ్

Published on Sep 17, 2024 8:50 AM IST

నోయల్, రిషిత నెల్లూరు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “బహిర్భూమి”. ఈ చిత్రాన్ని మహంకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. బహిర్భూమి సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘బహిర్బూమి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ వేణు గారు, డైరెక్టర్ రాంప్రసాద్ కు థ్యాంక్స్. ఈ సినిమాకు మంచి సాంగ్స్ చేసే అవకాశం దొరికింది. మంచి ఎనర్జిటిక్ సాంగ్స్ చేశాం. ఈ సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలి.’ అని అన్నారు.

నిర్మాత మచ్చ వేణు మాధవ్ మాట్లాడుతూ.. ‘సినిమా మీద ప్యాషన్‌తో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ప్రొడ్యూసర్‌గా మూవీస్ చేస్తున్నాను. బహిర్భూమి సినిమాకు మా టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు. మా సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ బాగా సపోర్ట్ చేశారు. మిగతా వాళ్లు టాయిలెట్ అంటూ ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టుకున్నారు. మేము ధైర్యంగా బహిర్భూమి అని సినిమాకు పేరు పెట్టాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో మంచి డేట్ చూసి గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేస్తాం.’ అని అన్నారు.

దర్శకుడు రాంప్రసాద్ కొండూరు మాట్లాడుతూ.. ‘బహిర్భూమి సినిమాకు హీరో నోయెల్ ఎంతో సపోర్ట్ చేశారు. నోయెల్, ఫణి వీళ్ల మధ్య కామెడీ సీన్స్ హైలైట్ అవుతాయి. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత వేణు గారికి థ్యాంక్స్. మేము బహిర్భూమి అని టైటిల్ ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. వెస్ట్రన్ కల్చర్ కంటే మన కల్చర్ చాలా గొప్పది. ఈ విషయాన్ని మా మూవీలో అంతర్లీనంగా చెబుతున్నాం. హీరోయిన్ రిషిత చాలా బాగా నటించింది. మా మూవీకి మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం.’ అని అన్నారు.

హీరో నోయల్ మాట్లాడుతూ ‘‘నేను చిన్న మూవీస్ చేయొద్దు అనుకుంటున్న టైమ్‌లో వచ్చిన చిత్రం బహిర్భూమి. ఈ సినిమాకు ముగ్గురు మెయిన్ పిల్లర్స్. వాళ్లే నిర్మాత వేణు మాధవ్, దర్శకుడు రాంప్రసాద్, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్. వీళ్లు ముగ్గురు లేకుంటే ఈ సినిమా లేదు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. త్వరలో థియేటర్స్ లోకి బహిర్భూమి సినిమా వస్తుంది. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా.’’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు